
- July 16, 2015
- No Comments
సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean
సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక ……
Krishna Dwarka sunk in the ocean womb !
192 కిలోమీటర్ల పొడవు… 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు… వీధుల వెంట బారులు తీరిన చెట్లు…
రాయల్ ప్యాలెస్‌లు… రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్ మాల్స్…
కమ్యూనిటీ హాల్స్… క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం … రత్నస్తంభాలు … వజ్ర తోరణాలు …
సాటిలేని ఆర్కిటెక్చర్ … సముద్రం మధ్యలో మహా నిర్మాణం … జగన్నాథుడి జగదేక సృష్టి …
ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ… ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో …
మన నాగరికత … మన సంస్కృతి … మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ …
ద్వారక !
అవును, రామాయణం నిజం ….. మహా భారతం నిజం… ద్వాపర యుగం నిజం…
వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా..
1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..
ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఏస్.ఆర్. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి… మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..
శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.
ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..
పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్ యుటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి..
బ్యూటీకే.. బ్యూటీ… అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది..
న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డిసి, లండన్, మాస్కో, బీజింగ్, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్ సిటీలు.. కాస్మో పాలిటన్ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్‌ఆర్ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు..
సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుత ద్వారకాధీశ్ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది…అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్ శిఖరమంత కీర్తి -కృష్ణ ద్వారక.
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021
Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care
Categories
- Amazon
- Article
- Background Jobs in SAP ?
- Bahrain Bus Route BPTC
- Bahrain Bus Routes
- Bhagavad Gita
- Bhagavad Gita Telugu
- Bible
- Bus Routes Singapore
- Business
- Construction
- Cooking
- COVID-19 Updates
- Cricket
- Deals / Offers
- Delhi Metro Lines
- Devotional
- Devotional Song Lyrics
- Dubai Bus Route
- Dubai Bus Route and Numbers
- Earn Money Online
- Education
- Electronics
- Embassy / Consulate
- Entertainment
- Festivals
- freeseotool
- Friendship stories in Telugu
- Funny Jokes
- GAMCA Approved Medical Centers
- Health
- Health & Yoga
- Hindi Song Lyrics
- Hindu
- Historical Names
- Holidays
- Hyderabad Local Bus
- Hyderabad Metro Train Route
- Indemnity
- Indians News
- Interview Tips
- ITIL
- Jobs
- Kaala Gnanam
- Kuwait Bus Route
- Kuwait Governorate
- Kuwait Info
- Kuwait Labor Law
- Kuwait Ministries
- Kuwait News
- Kuwait Schools
- Kuwait Universities
- Mall
- Monkeypox
- Moral Stories Telugu
- Movie Downloads
- Mumbai Bus Route
- Mumbai info
- Mumbai Metro Stations
- Muscat Bus Route
- Muscat InterCity Bus Route
- Name Meaning
- NTR
- Omicron Variant COVID-19
- Panchatantra Stories In Telugu
- Paramanandayya Kathalu in Telugu
- Passport
- Philippines
- Post Office GDS Results
- Pune Metro Lines
- Q8 News
- Qatar Bus Route
- Quotes
- Quran
- RamCharan
- RRR Movie updates
- RRR Trailer
- Samasyalu Parishkaram
- Sri Lanka
- Tamil Song Lyrics
- Technology
- Telephone Contact Number
- Telugu Song Lyrics
- Tenali Ramakrishna Stories in Telugu
- TSRTC
- TTD
- Valmiki Ramayanam
- Vande Bharat Trains
- Wisdom – Sadhguru
- Wishes
Leave Comment