Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

Moral Stories Telugu

Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు

“తాతా మనవరాలు”

“Grandfather Granddaughter”

 

Grandfather, Telugu Moral Stories
Grandfather, Telugu Moral Stories

 

నాన్న ఫోన్ రింగ్ టోన్ “వినరో భాగ్యము విష్ణుకథా”

నేను : నాన్న, అమ్మలేదా..!

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

నాన్న : ఎందుకు ఆకలేస్తుందా వచ్చి ముద్దలు కలిపి మీ అమ్మ అన్నం పెట్టాలా నీకు ..?

నే :అదేంటి ఏమైంది నాన్న అలా అనేశారు, నేను ఏదో ఊరికే అడిగా అమ్మ ఉందా అని.

నా: ఫోన్ నాది, రీఛార్జ్ చేపించేది నేను మీరు మాత్రం మీ అమ్మతోనే మాట్లాడుకోండి రేపే అమ్మేస్తున్నా ఈ ఫోన్..! ఉత్తరాలు రాసుకోండి ఇకమీద మీరు మీ అమ్మ ..! నాన్న వద్దు కానీ.., అమ్మ కావాలంట. అమ్మ ..! 😡😡

నే: 🤔🤦🏻‍♂️😂 ఏమైంది నాన్నా..!

నా: ఒక వారం నుంచి చూస్తున్నా మీ అమ్మాయ్, మీ అమ్మ వీడియో కాల్ మాట్లాడుతున్నారు.

నే : సరే ఐతే ఇప్పుడేమైంది..?

నా: మీ అమ్మ తాతతో మాట్లాడమని అనట్లేదు మీ అమ్మాయ్ నాతో మాట్లాడట్లేదు, 😡😠

నే : ఇంకా ఆమెకు( మా అమ్మాయికి) అంత జ్ఞానం రాలేదులే నాన్న..! నేను చెప్తాలే మాట్లాడమని ఈ చిన్న విషయానికి కోపమెందుకు🙂

నా : నీ బోడి వీడియో కాల్ రెకమండేషన్ ఎం అవసరం లేదు నాకు, ఈ ఆదివారం వచ్చి కోడల్ని అమ్మాయ్ ని దింపేసి పో ..!

నే :మీరే వచ్చి ఒక రెండ్రోజులు ఉండెలొచ్చుగా

నా : నేనేం పనిలేకుండా కాలిగా ఉన్నానా ..! దింపేసి పో ఒక వారం పాటు ఇక్కడే ఉంటారు..!

నే : సరే నాన్నా 🙂🤯😳🤔🤭🤫🙏🏻

కాసేపుతర్వాత మళ్ళీ..! “వినరో భాగ్యము విష్ణుకథా”

అమ్మ: చెప్పురా మీ అమ్మాయ్ ఎం చేస్తుంది..!

నేను:ఆవిడేమైనా కలెక్టర్ ఉద్యోగం చేస్తుందా. ఏమైనా చెయ్యటానికీ, ఆడుకుంటుంది

అ : ఏమైంది రా కోపంగా ఉన్నావ్ ఆపీసు పనెక్కువయిందా ..!?

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

నే : మమ్మల్ని ఎలా ఉన్నార్రాఅని అడగటం కూడా మర్చిపోయ్యారేంటి, మొన్న వచ్చిన మనవరాలు ఎక్కువైందా మీకు.

అ: ఏమైంది చెపితేగా తెలిసేది చెప్పు కోడలుతో ఏదైనా గొడవా ..?

నే : మోక్షతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు నాన్నకు కూడా కాసేపు ఇవ్వొచ్చుగా..!

అ : నాతో మీ అమ్మాయ్ ఎప్పుడు సరిగ్గా మాట్లాదుద్దిరా..? నేను కోడలుతో మాట్లాడుతా, రోజూ మోక్షతో మీ నాన్నే గా మాట్లాడేది.

నే : సరేలె ఆదివారం వస్తున్నాం, పాలు ఓ లీటర్ ఎక్కువ చెప్పండి ఓ వారంపాటు..! పనుంది ఉంటా మీ “ప్రేమకో” 🙏🏻 😂

మా యావిడ : ఎవరండీ ఫోన్లో అత్తయగారా..! కాదే మా నాన్న..! మామయ్యగారు మీరు మాట్లాడారంటే ఏదో ముఖ్యమైన విషయమే ..! ఏంటో చెప్పొచ్చుగా..! మన పెళ్లి కట్నం మాట్లాడాడేటప్పుడు మీ నాన్న నాకో బండి కొనిస్తా అన్నారుట, కొనిస్తాడో లేదో నీతో చెప్పి కన్నుకో అంటున్నారు..!

మా నాన్న మీకు బండి కొనిస్తా అన్నారా..? నాకెప్పుడూ చెప్పలేదండి ..! మా అమ్మతో మాట్లాడి చెప్తా ఓసారి ఫోన్ ఇలా ఇవ్వండి ..! వద్దులేవే ఇప్పుడు డబ్బులున్నాయో లేవో ఉన్నప్పుడు ఇస్తాడులే అడగమాక ..! 😂😛😂🤫

ఇట్లు మీ

జ్ఞానా చారి

Moral Story for Kids Telugu kathalu, Value of Human Life

Grandfather, Telugu Moral Stories


Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు


Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి


Telugu Moral Stories, Old TV Katha పక్కింటోడి టీవీ …!


Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

Kuwait Jobs News

Leave Comment