Latest Honey Rose Mallu Actress Hot, Sexy HoneyRose Malayalam

Hindu Historical Names

Alakananda, Atikaayudu అతికాయుడు, అలకనంద

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

 
Alakananda : అలకనంద —
దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని వైతరణి అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.
స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.
 
* స్వర్గలోకంలో మందాకిని,
 
* భూలోకంలో గంగ మరియు అలకనంద
 
* పాతాళలోకంలో భోగవతి
 
అని గంగానదికి పేర్లు.
 

AtikaayuDu : అతికాయుడు –

రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు.
వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు.
చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.
Kuwait Jobs News

Leave Comment