Vande Bharat Express Timings, Stops between Visakhapatnam and Secunderabad

Hindu Historical Names

Ekalavyudu, Ethasham, Gouri ఏకలవ్యుడు

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

 
EkalavyuDu : ఏకలవ్యుడు —
మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు.
ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు.
ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు.
ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు.
అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణ గా ఇమ్మని అడుగుతాడు.
గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
 
Ethasham :
ఏతశం –సూర్యుని రధం గుర్రాలలో ఒకటి
 
Gouri : గౌరి —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు.
భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

What is Mattu Pongal, Why Celebrating the Pongal Benefits పొంగల్ ఎందుకు జరుపుకుంటారు

 

Ekalavyudu, Ethasham, Gouri

 


Bhagavad Gita in 100 Sentences Telugu , భగవద్గీత, మహాభారతము సమగ్ర సారాంశము


Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం

Kuwait Jobs News

Leave Comment