8 Evidences which prove that Ramayan is not a myth, it is our history  

Hindu Historical Names

Indrajittu Indrudu Indramaala Jatayuvu

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

 
Indrajittu : ఇంద్రజిత్తు –
ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము).
ఇంద్రజిత్తు —
రావణాసురిడికి మండోదరి కి జన్మించిన పెద్ద కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని నామకరణం చేశారు.
స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి(బ్రహ్మ) అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.
ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల)నాగకన్య ను వివాహమాడినాడు

What is Mattu Pongal, Why Celebrating the Pongal Benefits పొంగల్ ఎందుకు జరుపుకుంటారు

 

 

IndruDu ; ఇంద్రుడు , దేవేంద్రుడు —
హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు (ఇంద్రుడు , అగ్ని ). అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం ఐరావతంఅనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి మరియు కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.
 
Indramaala : ఇంద్రమాల —
ఒక కమల మాలిక . ఎన్నడూ వాడనిది . ఈ మాల ధరించిన వారిని ఏ అస్రమూ ఎమీ చేయలేదు .
 
Jatayuvu : జటాయువు —
రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
Indrajittu Indrudu Indramaala Jatayuvu
Kuwait Jobs News

Leave Comment